బిజెపి ఇలా చేయకపోతే కాపులు దూరం అయినట్టే…?
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన ఏ విధంగా ఉంది ఏంటి అనే అంశాన్ని పక్కనబెడితే తిరుపతి ఉప ఎన్నికల్లో కొన్ని కొన్ని అంశాలను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈ మధ్య కాలంలో పెద్దగా బయటకు రావడం లేదు అనే భావన కూడా ఉంది.
దీనికి కారణంగా చాలా మంది కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో పని చేయలేక పోతున్నారు. జనసేన పార్టీకి కాపు సామాజికవర్గం ముందు నుంచి అండగా నిలబడుతుంది. కాబట్టి ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకుని ఆ సామాజికవర్గం నేతలతో బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం చేసుకోవాలి. కేంద్ర మంత్రులు కూడా జనసేనను ఆకట్టుకునే విధంగా రాజకీయం చేయాల్సి ఉంటుంది. కానీ సొంతంగా ముందుకు వెళ్లే ప్రయత్నం కేంద్ర మంత్రులు బిజెపి రాష్ట్ర నాయకత్వం చేయడంతో జనసేన పార్టీ నేతలలో కూడా అసహనం వ్యక్తమవుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ ని వాడుకొనే విషయంలో బీజేపీ నేతలు ముందుకు వెళ్ళలేక పోతున్నారు. దళిత సామాజిక వర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. అయినా సరే ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే విధంగా ముందుకు వెళ్లడంలేదు. జనసేన పార్టీ లో చాలా మంది నేతలు ఆదరణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి తీసుకు వెళితే గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. ప్రచారం విషయంలో బీజేపీ నేతలు జనసేన పార్టీ నేతలు కలిసి వెళ్లకపోతే మాత్రం రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి.
అది కచ్చితంగా మీడియాలో హైలెట్ అవుతుంది మీడియాలో హైలెట్ అవుతుంది. దాని ద్వారా ఇతర పార్టీలకు లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నేతలు… కాపు సామాజిక వర్గం మీద దృష్టిపెట్టి కొందరు నేతలను రంగంలోకి దించారు. అదే విధంగా అధికార పార్టీ కూడా కొంతమంది కాపు సామాజిక వర్గం నేతలతో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ జనసేన పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే విషయంలో మాత్రం బీజేపీ నేతలు విఫలం అయ్యారు. ఇప్పటికే జనసేన పార్టీకి సీటు ఇవ్వలేదు అనే కోపం జనసేనలోని కాపు సామాజిక వర్గం లో ఎక్కువగా ఉంది.













