టీడీపీ లెక్కలు ఈ సారి మారుతాయి.. మేజిక్ నంబర్ చంద్రబాబు సాధిస్తాడా..
గత కొద్ది కాలంగా పొత్తులపై టీడీపీ ,జనసేన, బీజేపీ మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. 175 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ 144 తన ఖాతాలో వేసుకోగ బీజేపీ జనసేనలకు కలిపి 31 సీట్లను కేటాయించింది. అయితే 31 సీట్లలో ఎన్ని గెలుస్తారు అన్న విషయం పై టీడీపీ శ్రేణులలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీకి కేటాయించిన 10 సీట్లలో కచ్చితంగా గెలుస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నవి కేవలం ఒకటో రెండో ఉండవచ్చు.. అలాగే జనసేనకు వచ్చిన 21 సీట్లలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మిత్రపక్షాలకే కేటాయించిన మొత్తం 31 సీట్లలో గట్టిగా ఒక 12 గెలిస్తే ఎక్కువ అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం ఫాం చేయాలి అంటే టిడిపి కచ్చితంగా 88 సీట్లు తెచ్చుకోక తప్పదు. గత ఎన్నికలలో లెక్కలు తీసుకుంటే.. 2014లో బీజేపీ కి 12 సీట్లు ఇచ్చి 163 సీట్లలో పోటీ చేసిన టీడీపీ కేవలం 102 స్థానాలలో గెలిచింది. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు ఉన్నాయి.. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి జగన్ చేసిన ప్రగతి ఏంటో అందరికీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ చంద్రబాబు అన్న ధీమా కూడా తెలుగుదేశం శ్రేణులలో గట్టిగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు మ్యాజిక్ మరొకసారి వర్క్ అవుట్ అవుతుందా లేదా చూడాలి.













