శారదాపీఠాన్ని సందర్శించిన హరియాణా గవర్నర్
వేద పోషణ కోసం విశాఖ శారదా పీఠం చేస్తున్న కృషి మరువలేనిదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న చతుర్వేద హవనం, సచ్చిదానంద విద్వత్, శాస్త్ర, శ్రౌత సభలకు హాజరయ్యారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంత్ర సరస్వతీ స్వాములను కలుసుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి వాతావరణం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం శారదపీఠం ముద్రించిన మాండ్యుకోపణిషత్ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. గవర్నర్తో పాటు ఎమ్మెల్సీ పీవీఎన్. మాధవ్, చాగంటి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.













