విజయవాడ నుంచే హజ్‌యాత్ర
వచ్చే ఏడాది నుంచి విజయవాడ విమానాశ్రయంలో హజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎమ్మెల్సీ మొహమ్మద్ షరీఫ్, పలువురు ముస్లిం పెద్దలు న్యూఢిల్లీలో వెంకయ్యను కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్‌యాత్రకు వెళ్లే భక్తుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. విభజన నేపథ్యంలో నవ్యాంధ్రలో హజ్ ఎంబార్కేషన్ పాయింట్ లేదు. ఏటా 3వేల మంది హజ్‌కు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ చేరుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో హజ్ పాయింట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గతంలో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా హజ్కేంద్రం ఏర్పాటు చేయాలని వెంకయ్యను వీరు కోరగా, కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో ఆయన మాట్లాడి, నిర్దిష్ట హామీని ఇప్పించారు.













