చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడే.. గిడుగు రుద్ర రాజు
ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా,కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాల కోసం సినిమాలను వదిలేసిన చిరంజీవి ఆ తర్వాత మళ్లీ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమాలలో ఫుల్ బిజీగా ఉంటూ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఏపీలో రాజకీయ హడావిడి చోటు చేసుకున్న నేపథ్యంలో తిరిగి మరొకసారి చిరంజీవి పేరు కాంగ్రెస్ తో కలిపి వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి పార్టీ నిమిత్తం డొనేషన్ ఇచ్చిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.ఈ క్రమంలో చిరంజీవి పొలిటికల్ స్టేటస్ పై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు చిరంజీవి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని స్పష్టం చేశారు. కేవలం తమ్ముడు అనే ఉద్దేశంతో జనసేనకు ఆర్థిక సహాయం అందించారు అని రుద్రరాజు అన్నారు. ఇక దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.













