అమరావతి కూడా హైదరాబాద్ కు మించి అభివృద్ధి : గాలి
అమరావతి కూడా హైదరాబాద్‌కు మించి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబేనని అన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు, తెలంగాణ రాష్ట్రం లాభపడేట్లు చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణకే చెందేలా చేశారని మండిపడ్డారు. 976 కిలోమీటర్లు ఉన్న తీరప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. గత సంవత్సరం 11 శాతం ఉన్న జీడీపీని ఈసారి 14 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, ఇంత చేస్తున్నా కాంగ్రెస్ నేతలు విమర్శించడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ దుష్టశక్తి అని మండిపడ్డారు.













