మాతాశిశు సంరక్షణ కేంద్రం భవనానికి రూ. 2 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు సర్వజనాసుపత్రిలో నిర్మిస్తున్న మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి దివంగత డాక్టర్ నూతక్కి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె బీనా, డాక్టర్ తాతినేని గోపాలరావు దంపతులు రూ.2 కోట్ల విరాళం అందజేశారు. గుంటూరు మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (జింకాన) సాయంతో రూ. వంద కోట్ల అంచనా వ్యయంతో జీజీహెచ్లో ఈ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ సంఘం పిలుపు మేరకు బీనా దంపతులు స్పందించి గుంటూరులోని జింకాన సమన్వయకర్త బాలభాస్కరరావుకు విరాళం చెక్కును అందజేశారు. డాక్టర్ నూతక్కి వెంకటేశ్వరరావు గతంలో జీజీహెచ్ సర్జరీ విభాగంలో గౌరవ ఆచార్యుడిగా సేవలందించారు.













