Nandigam Suresh : కోర్టులో లొంగిపోయిన నందిగం సురేష్
అమరావతి రాజధాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ (Nandigam Suresh) కోర్టులో లొంగిపోయారు. మండవ మహాలక్ష్మి అనే మహిళ 2020 ఫిబ్రవరిలో అమరావతి (Amaravati) పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సురేశ్‌తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Appireddy) , మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వైసీపీ(YCP) ప్రభుత్వం అండదండలతో వీరిని పోలీసులు అరెస్టు చేయలేదు. ఈ క్రమంలో తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (Civil Judge) ఎదుట నందిగం సురేశ్ లొంగిపోయారు. అతడి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారించిన సివిల్ జడ్జి అతడికి బెయిల్ (Bail) మంజూరు చేశారు.













