గౌతంరెడ్డి జీవిత సంగ్రహం పుస్తకావిష్కరణ
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపై రూపొందించిన చిరస్మరణీయుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కావించారు. దివంగత గౌతమ్‌రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రచయిత జర్నలిస్ట్ విజయార్కె పుస్తక రచన చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని జ్ఞాపకాలను ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.













