తక్కువ వచ్చిన వారు.. ఎక్కువ వచ్చిన వారితో
మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడేళ్లలో డీఎస్సీ ఒక్కసారి కూడా నిర్వహించలేదన్నారు. గతంలో పోలిస్తే పదో తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఈ ఉత్తీర్ణతను గుజరాత్‌తో పోల్చుకోవడం అవివేకమన్నారు. తక్కువ వచ్చిన వారి కంటే ఎక్కువ వచ్చిన వారితో పోల్చుకోవాలన్నారు. కొన్ని స్కూళ్లు హెడ్ మాస్టర్, పీఈటీ లేకుండా నడుస్తున్నాయన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 4,672 పోస్టులను రద్దు చేశారని అన్నారు. ఉపాధ్యా సంఘాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి జగన్‌పై పోరాడాలని సూచించారు.













