ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరిమున్నీసా మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ను మార్చి 7న విడుదల చేయనున్నారు. నామినేషన్లు 14వ తేదీ వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన 15న జరగనుంది. 17న నామినేషన్లు ఉపసంహరణ. 24 ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 28తో ముగుస్తుంది. ఉప ఎన్నికలో గెలిచిన అభ్యర్థి 2027 మార్చి 29 వరకు పదవిలో కొనసాగుతారు.













