మిన్నసోటా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 15 న దీపావళి వేడుకలు
మిన్నసోటా తెలుగు సంఘం ఆధ్వర్వంలో దీపావళి సంబరాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అమెరికాలోని తెలుగు వారందరూ కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నవంబర్ 15 వ తేదీన ఈ వేడుకలు ప్రారంభం అవుతాయి. Eden Prairie High School, 17185 Valley View Rd, Eden Prairie, MN 55346 వేదికగా జరిగే ఈ వేడుకలు, సాయంత్రం 4:00 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.
ఈ వేడుకలకు వచ్చే అతిథుల కోసం (India Spice House Restaurant & Grocery వారి సౌజన్యంతో రకరకాల వంటకాలను, స్నాక్స్, డ్రింక్స్ ను కూడా అందుబాటులో వుంచుతున్నారు.
స్నాక్స్ (Snacks): ఉల్లిపాయ సమోసా ($3), సాధారణ సమోసా ($4), వెజ్ పఫ్ ($4), ఎగ్ పఫ్ ($4), సమోసా చాట్ ($6), టోఫు ఫ్రై ($6), చికెన్ ఫ్రై ($8), కట్ మిర్చి ($5) లభిస్తాయి.
పానీయాలు & డ్రింక్స్ (Beverages): వాటర్ ($1), చాయ్ ($1), సోడా ($2), ఐస్ క్రీమ్ ($3), మ్యాంగో లస్సి ($4) అందుబాటులో ఉంటాయి.
నాన్-వెజ్ డిన్నర్ ప్లాటర్ ($13): ఇందులో చికెన్ 555, చికెన్ కర్రీ, చపాతీ, చికెన్ బిర్యానీ మరియు షాಹಿ తుక్డా వడ్డించబడతాయి.
వెజ్ డిన్నర్ ప్లాటర్ ($12): ఇందులో గోబి/టోఫు ఫ్రై, మిక్స్డ్ వెజ్ కర్రీ, వెజ్ బిర్యానీ, చపాతీ మరియు షాహి తుక్డా ఉంటాయి.
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అట్టహాసంగా జరగనున్న ఈ దీపావళి వేడుకలకు మిన్నసోటాలోని తెలుగు వారందరూ కుటుంబ సమేతంగా హాజరై పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.







