పారిశ్రామిక సదస్సుకు అనూహ్య స్పందన
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా 30కిపైగా దేశాల రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్ జనరల్స్‌తో విజయవాడలో నిర్వహించిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. దక్షిణ కొరియా, బ్రిటన్, సింగపూర్, పోలండ్, బల్గేరియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండోనేషియాలతోపాటు మొత్తం 15 దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖాముఖి చర్చలు జరిపారు. షెడ్యూల్ కంటే అదనంగా మరో గంటకుపైగా సమయం కేటాయించి విదేశీ ప్రతినిధుల సందేహాలను నివ త్తి చేశారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమని, పరిశ్రమలు పెట్టేవారికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పరిశ్రమలు స్థాపించేవారికి జిల్లా స్థాయిలోనే సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నామని, ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయదలచినవారు కేవలం ఒకే ఒక దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు. అనుమతుల కోసం సుదీరెంగా వేచి చూడాల్సిన అవసరంలేదని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని, అనుమతులపై ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షించి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
పోలండ్ రాయబారి ఆడం బురాకోవిస్కి సీఎంతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఎల్ఈడీ బల్బుల తయారీకి పోలండ్ ప్రసిద్ధి చెందిందని వివరించారు. ఏపీలో ప్లాంట్ నెలకొల్పడానికి ముందుకు రావాలని సీఎం కోరారు.
డెన్మార్క్ తరఫున బెంగళూరులోని కాన్సులేట్ జనరల్ జెట్టీ బెర్రూం ముఖ్యమంత్రితో చర్చించారు. పోర్టులు, లాజిస్టిక్స్, తీర ప్రాంతాల అభివ ద్ధి, ఇ గవర్నెన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నామని తెలిపారు. ఏపీలోని నగరాలతో భాగస్వామ్య ఒప్పందాలకు సిద్ధమని చెప్పారు. పీపీపీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు.













