మంత్రి నారాయణను సన్మానించిన క్రెడాయ్ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ( Narayana)ను క్రెడాయ్ ( CREDAI) ఏపీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను మరింత సులభతరం చేసేలా ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 161ను విడుదల చేయడం పట్ల వారు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ( Minister)కి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి అభినందనలు (congratulations) తెలియజేశారు.








