ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathiraju Srinivasa Varma) జన్మదిన వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Amit Shah) ను కలిశారు. వర్మ ఇంట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి (Kumaraswamy) పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ (Harivansh Narayan), వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు,పారిశ్రామికవేత్తలు శ్రీనివాసవర్మకు శుభాకాంక్షలు తెలిపారు.








