ఏపీలో మరోసారి సర్ షెడ్యూల్ను సవరించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు జాబితా (Voter List) ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) (ఈసీఐ) మరోసారి పొడిగించింది. అక్టోబరు 16న తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. వచ్చే నెల 10 వరకు నోటీసులు (Notices), క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబరు 5 వరకు అవకాశం కల్పిస్తామని, అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని గతంలో ఈసీ ప్రకటించింది. తాజాగా ఆ గడువును మరోసారి పొడిగించింది. సవరించిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ (Political party)లకు రాతపూర్వకంగా తెలియజేయడంతో పాటు, మీడియా (Media) ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఈసీఐ ఆదేశించింది.








