రానా, అక్షయ్‌లతో చందూ భారీ మూవీ
టాలీవుడ్ డైరెక్టర్ చందూ మొండేటి(chandoo mondeti) నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రానా దగ్గుబాటి(rana daggubati), బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(akshay kumar)లతో కలిసి ఓ భారీ బైలింగువల్ మూవీని తెరకెక్కించనున్నట్లు చందూ స్వయంగా వెల్లడించారు. హిందీ- తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు ప్రస్తుతానికి మహాకాల్(mahakal) అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్(karan johar) నిర్మించే అవకాశాలు ఉన్నాయని రానా(Rana) తనతో చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు. అయితే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ ఇంకా ఫిక్స్ కాలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉందని చందూ మొండేటి స్పష్టం చేశారు. కథపై డిస్కషన్స్ జరుగుతుండటంతో పాటు, కీలక టెక్నీషియన్ల ఎంపిక కూడా కొనసాగుతోందని చెప్పారు. అలాగే ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali) కథ అందిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. కథ, దర్శకత్వం తనవేనని వెల్లడించిన చందూ.. భన్సాలీతో మరో కథ విషయంలో మాత్రం డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలిపారు.
ముంబైలో రానాతో జరిగిన కొన్ని సీన్స్ తర్వాత ఈ సినిమా ఆలోచన ముందుకు వచ్చినట్లు చందూ వివరించారు. రానా మంచి కథ కోసం అడగడంతో తాను రెండు, మూడు కథా ఆలోచనలు వినిపించగా, చివరకు పౌరాణిక నేపథ్యంలోని ఈ కథను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. ఉజ్జయిని, శివుడితో ముడిపడిన హిస్టరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ నేపథ్యాన్ని తెరపై భారీ స్థాయిలో ఆవిష్కరించాలనే ఆలోచనతో ఈ కథను ఎంచుకున్నట్లు చందూ తెలిపారు.








