తమ్ముడు కార్తికేయ సినిమాకు అన్న ఎన్టీఆర్ రివ్యూ
ఎన్టీఆర్(NTR) ప్రశంసలతో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్(Dont trouble the trouble) మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ సినిమాలో ఎమోషన్స్ సహజంగా ఆకట్టుకుంటాయని తారక్ (tarak) పేర్కొన్నారు. ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్(Fahas faasil) పోషించిన సూరి క్యారెక్టర్, ఆయన చూపించిన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని ప్రశంసించారు. చిన్నారి సారా(sara) కూడా తన నేచురల్ యాక్టింగ్ తో స్పెషల్ గా ఆకట్టుకుందని తారక్ చెప్పారు.
మొదటి ప్రయత్నంలోనే డైరెక్టర్ శశాంక్(sashank) కథను ఎమోషనల్ గా తెరపైకి తీసుకొచ్చిన విధానం తనను ఆకట్టుకుందని ఎన్టీఆర్ వెల్లడించారు. సినిమాలోని ఎమోషన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని, కాల భైరవ(kaalabhairava) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథనానికి మరింత బలాన్ని అందించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఆడియన్స్ ను ఎమోషనల్ జర్నీలో తీసుకెళ్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి
చాలా రోజుల తర్వాత పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చూడగలిగే సినిమాగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ నిలుస్తుందని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ స్పెషల్ మూవీని నిర్మించిన కార్తికేయ(karthikeya)పై గర్వంగా ఉందని చెబుతూ, అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను ఆడియన్స్ తప్పక చూడాలని తారక్ కోరారు.








