నెట్‌ఫ్లిక్స్ లో ఇరుముడి జోరు.. గ్లోబల్ నెంబర్ వన్
రవి తేజ(raviteja) హీరోగా శివ నిర్వాణ(Siva nirvana) తెరకెక్కించిన ఇరుముడి(Irumudi) ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది. థియేట్రికల్ రన్ తర్వాత సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందిన నాన్ ఇంగ్లిష్ సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఈ వారంలో ఏకంగా 3.4 మిలియన్ వ్యూస్‌ను నమోదు చేసింది.
రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే 3.4 మిలియన్ వ్యూస్ సాధించిన ఇరుముడి, ఆ తర్వాతి ఏడు రోజుల్లో మరో 3.4 మిలియన్ వ్యూస్‌ను అందుకోవడం విశేషం. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటివరకు ఈ సినిమాకు నమోదైన మొత్తం వ్యూస్ 6.8 మిలియన్లకు చేరుకున్నాయి. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా డిజిటల్ ప్లాట్ఫార్మ్ పై కూడా అదే జోరును కొనసాగిస్తోంది.
ఫ్యామిలీ, డివోషనల్ జర్నీ చుట్టూ సాగే ఈ కథలో రవి తేజతో పాటు సాయి కుమార్(sai kumar), ప్రియా భవానీ శంకర్(Priya bhavani shankar) కీలక పాత్రల్లో కనిపించారు. తెలుగు సినిమాకు సంబంధించిన కంటెంట్‌కు అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న రెస్పాన్స్ కు ఇరుముడి గణాంకాలు మరో ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాయి. తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.








