రూ. 300 కోట్లకు లవ్ అండ్ వార్ రైట్స్?
బాలీవుడ్లో భారీ అంచనాలున్న లవ్ అండ్ వార్(love and war) మూవీ రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా సెన్సేషన్ గా మారుతోంది. సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్(ranbir kapoor), అలియా భట్(aliabhatt), విక్కీ కౌశల్(vicky kaushal) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ డీల్ కుదిరినట్లు బాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ మొదలైంది.
బాలీవుడ్ మీడియా వివరాల ప్రకారం.. లవ్ అండ్ వార్ థియేట్రికల్ రైట్స్‌ను పెన్ మరుధర్ సంస్థ ఏకంగా రూ.300 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది కేవలం దేశీయ మార్కెట్‌కు పరిమితమైన డీల్ గా కాకుండా గ్లోబల్ డీల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపినప్పటికీ, భన్సాలీ టీమ్‌కు భారీ వాల్యూని అందించే ఆఫర్‌ను పెన్ మరుధర్ సొంతం చేసుకున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి
ఇక సినిమా ప్రమోషన్ల విషయంలోనూ మేకర్స్ స్పెషల్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ కు దారితీశాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దీపావళి సందర్భంగా లవ్ అండ్ వార్ టీజర్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో భన్సాలీ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా రామాయణ మూవీ ప్రింట్లతో టీజర్‌ను థియేటర్లలో ఎటాచ్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.








