జైలర్2లో తన పాత్రపై క్లూ ఇచ్చిన శివన్న
సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) జైలర్(jailer) సాధించిన భారీ సక్సెస్ కు కథతో పాటు స్టార్ హీరోల స్పెషల్ క్యామియోలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ముఖ్యంగా కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (sivaraj kumar) కనిపించిన తీరు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన క్యారెక్టర్ కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఇప్పుడు జైలర్2(jailer2)లో ఆయన స్క్రీన్ స్పేస్ మరింత పెరగడం ఆసక్తిని పెంచుతోంది. దీంతో ఈసారి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెలకొంది.
తాజాగా తన క్యారెక్టర్ గురించి శివరాజ్‌కుమార్ చేసిన కామెంట్స్ జైలర్ సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు పెంచుతున్నాయి. డైరెక్టర్ నెల్సన్ తన క్యారెక్టర్ ను ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారని, గతంతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తానని ఆయన తెలిపారు. స్పెషల్ క్యారెక్టర్లు తనను వెతుక్కుంటూ రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా రజినీకాంత్‌తో కలిసి వర్క్ చేయడం, ఆయనతో టైమ్ స్పెండ్ ఎంతో ఆనందంగా ఉంటుందని శివరాజ్‌కుమార్ పేర్కొన్నారు.
నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్2లో విద్యాబాలన్(vidya balan), సూరజ్ వెంజారమూడు(suraj venjaramudu), మిర్నా(mirna), రమ్యకృష్ణన్(ramyakrishnan), మిథున్ చక్రవర్తి(mithun chakravarthy) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్‌లాల్ (mohanlal), హృతిక్ రోషన్(hrithik roshan), విజయ్ సేతుపతి(vijay sethupathi) స్పెషల్ రోల్స్ లో సందడి చేయనున్నట్లు సమాచారం. అనిరుధ్(anirudh) మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.








