నితిన్ నబీన్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin)తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) ఢిల్లీ (Delhi)లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై నితిన్నబీన్ ఈ సందర్భంగా మార్దనిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి (NDA alliance) ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జాతీయ నాయకత్వం సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పీవీఎన్ మాధవ్ తెలిపారు.








