కాఫీ విత్ కరణ్‌కు ఎండ్ కార్డ్
కరణ్ జోహార్(Karan johar) హోస్ట్‌గా తెరకెక్కిన ప్రముఖ సెలబ్రిటీ చాట్ షో కాఫీ విత్ కరణ్(Coffee with karan) కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లతో ఆడియన్స్ ను అలరించిన ఈ షోకు తొమ్మిదో సీజన్ చివరిదిగా ఉండబోతోందని కరణ్ జోహార్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. రెండు దశాబ్దాలకు పైగా సాగిన షో ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
2004లో ప్రారంభమైన కాఫీ విత్ కరణ్ ఇప్పటివరకు 161 ఎపిసోడ్లను పూర్తి చేసింది. బాలీవుడ్ ప్రముఖుల సినిమాలు, కెరీర్, స్నేహాలు, రిలేషన్‌షిప్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలపై కరణ్ అడిగే ప్రశ్నలు షోకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్, సెలబ్రిటీ కామెంట్స్, కాంట్రవర్సీ కామెంట్స్ కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చాయి.
ఇక చివరి సీజన్‌గా రాబోతున్న కాఫీ విత్ కరణ్9 పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్(Jio hotstar)లో ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ఫైనల్ సీజన్లో పాల్గొనే సెలబ్రిటీల ఫుల్ లిస్ట్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు.








