మైత్రీ టెన్షన్ కు ఆ సినిమాలే కారణం
టాలీవుడ్లో వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers)కు ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు పెద్ద సవాల్‌గా మారినట్లు కనిపిస్తోంది. ప్రభాస్(prabhas) హీరోగా హను రాఘవపూడి(hanu raghavapudi) తెరకెక్కిస్తున్న ఫౌజీ, ఎన్టీఆర్(NTR)- ప్రశాంత్ నీల్(Prasanth Neel) కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్(Dragon) సినిమాలు అనుకున్న షెడ్యూల్స్కు భిన్నంగా సాగుతున్నాయి. ఆలస్యంతో పాటు నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుండటంతో ఈ రెండు సినిమాలపై నిర్మాతల పెట్టుబడి భారీ స్థాయికి చేరినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
స్వాతంత్య్రానికి పూర్వం నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఫౌజీకి హను రాఘవపూడి ప్రత్యేకమైన విజువల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కోసం ప్రభాస్ తన షూటింగ్ షెడ్యూల్‌ను ఎంతో ప్రాధాన్యతతో పూర్తి చేస్తున్నాడు. డిసెంబర్ 3న రిలీజ్ సాధ్యం కాదని మేకర్స్ స్పష్టం చేయడంతో కొత్త రిలీజ్ డేట్‌పై ఆసక్తి నెలకొంది. పెరుగుతున్న బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే బాక్సాఫీస్ ఫలితం కీలకంగా మారింది.
ఇవి కూడా చదవండి
మరోవైపు డ్రాగన్ విషయంలోనూ ఆలస్యం, షూటింగ్ మార్పులు, అదనపు వ్యయం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ గాయం కారణంగా షెడ్యూల్ ప్రభావితమవ్వగా, ప్రస్తుతం 2027 జూన్ రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ రెండు సినిమాలపై మైత్రీ మూవీ మేకర్స్ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో, థియేట్రికల్ మార్కెట్లో ఈ సినిమాల పెర్ఫార్మెన్స్ సంస్థకు అత్యంత కీలకంగా మారనుంది.








