వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డికి హైకోర్టు షాక్
మెగా డీఎస్సీ (DSC)పై సీబీఐ విచారణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) నిరాకరించింది. డీఎస్సీపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి (Parvathar Reddy) పిల్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. స్పోర్ట్స్ కోటా (Sports Quota)తో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు రావట్లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేమని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం పిల్‌ను అనుమతిస్తే, దాని ఉద్దేశం దెబ్బతింటుందని కోర్టు వ్యాఖ్యానించింది.








