వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం YCP Central Office) వద్ద బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) తన భార్యతో కలిసి నిరసనకు దిగాడు. మాజీ సీఎం జగన్ (Jagan)ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించాడు. తనతో పాటు తన కుటుంబానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) బహిరంగ క్షమాపణ చెప్పాలన్నాడు. పార్టీ కోసం పదేళ్లు కష్టపడ్డా. తొమ్మిది నెలలు జైల్లో ఉన్నా. నన్ను రౌడీషీటర్ అని వ్యాఖ్యానించిన కారుమూరి వెంకట్ రెడ్డి (Karumuri Venkat Reddy)ని పార్టీ నుంచి తొలగించాలి. పార్టీ వాళ్లే రౌడీషీటర్ అంటుంటే నా కుటుంబసభ్యులు బాధపడుతున్నారు అని బోరుగడ్డ అనిల్ అన్నారు.








