నచ్చకపోతే పేరును మార్చుకోవచ్చు..
అన్ని ప్రాంతాలకు సమ దూరంలో ఉన్న అమరావతిని తరలించటం సరికాదని సీపీఎం నేత రాఘవులు అన్నారు. సీఎం జగన్‌కు రాజధాని పేరు అమరావతి నచ్చకపోతే మార్చుకోవచ్చునని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఒక మూలన విశాఖను రాజధానిగా చేయటం సరికాదన్నారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు సీఎం జగన్‌కు నచ్చలేదమో అని రాఘవులు వ్యాఖ్యానించారు. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ఆయన.. తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడకపోవటం విచాకరం అన్నారు. కేసీఆర్‌తో కలిసి జగన్ ఏపీకి న్యాయం జరిగేలా పోరాడాలని సూచించారు.













