ఏపీలో తొలిరోజు 5 లక్ష మందికి ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిరోజు 5 లక్షల మంది బాలబాలికలకు టీకా పంపిణీ చేశారు. రాష్ట్రంలో 15-18 ఏళ్ల బాలబాలికలకు ప్రారంభమైన తొలి విడత టీకా పంపిణీ ఈ నెల 7వ తేదీ వరకు జరగనుంది. కొవాగ్జిన్ టీకా పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా జరుగుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మంది పిల్లలకు టీకా వేశారు. కృష్ణా జిల్లాలో 64వేల మంది బాలబాలికలకు వేశారు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లల్లో 40 వేల మందికి చొప్పున వేశారు. ఈ వయస్సు కలిగిన వారు రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల మంది ఉన్నారు.