ఏపీలో 2671 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నమోదవుతున్న కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గం•ల్లో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2671కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో ఏడు కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నాయి. వీటిలో చిత్తూరు జిల్లాలో 5 ఉండగా నెల్లూరు జిల్లాలో మరో రెండు కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,240 శాంపిల్స్‌ను పరీక్షించారు. తాజాగా 41 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 767 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నేడు ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.






