ఏపీలో 2605కి చేరిన కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2,605కి చేరుకున్నాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చెందిన 153 కేసులు ఉన్నాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం 9 గంటల మధ్య (24 గంటల వ్యవధిలో) 8,092 నమూనాలను పరీక్షించగా 45 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన నలుగురు ఉన్నారు. నెల్లూరులో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 54కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 41 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య 1,680కి చేరింది. ప్రస్తుతం 718 మంది చికిత్స పొందుతున్నారు.






