ఏపీలో కరోనా కలకలం…
ఆంధప్రదేశ్‌లో కొవిడ్-19(కరోనా) వైరస్ కలకలం రేపుతోంది. ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ సృష్టం చేసింది. విశాఖలో 5, శ్రీకాకుళంలో 3, ఏలూరు, విజయవాడ, కాకినాడలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కరోనా అనుమానిత కేసులతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అనుమానితులను వెంటన ఆస్పత్రులకు తరలించి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
కరోనా అనుమానిత కేసులు నమోదు కావడంతో సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో మల్టీ సెక్టోరల్ కో ఆర్డినేటర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అదనపు సీఎస్, వివిధ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతునన కరోనా అనుమానితులకు మెరుగైన వైద్యం అందివ్వాలని నిర్ణయించారు.













