ప్రత్యేకహోదాకు కట్టుబడి ఉన్నాం : ఊమెన్
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీ అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. యూత్ కాంగ్రెస్ నేతలు భారీ బైక్ ర్యాలీతో నగరంలో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అసరమన్నది రఘువీరా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వివరించారని తెలిపారు. దీనిపై సోనియా, రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని, తాము అధికారం రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని సృష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.













