పెట్టుబడులకు ఎపి అన్నీవిధాల అనుకూలం – జగన్
వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గ్ధామంగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన డిప్లమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందఠంగా ఆయన మాట్లాడుతూ పరస్పర ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పెట్టుబడులకు సంబంధించి వివిధ ఒప్పందాలు కుదుర్చుకునే లక్ష్యంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా క తజ్ఞతలు తెలిపారు.
ఈ సదస్సుకు దక్షిణ కొరియా, ఇంగ్లాండ్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, మంగోలియా, తదితర 35 దేశాలకు చెందిన 50 మంది ప్రతినిధులు, 16 మంది రాయబారులు పాల్గొనడం పట్ల ప్రతీ ఒక్కరికీ ఆయన క తజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఆరు విమానాశ్రయాలు, నాలుగు ప్రధాన ఓడరేవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడులకు స్వర్గ్ధామం ఆంధ్రప్రదేశ్ అని ఆయన పునరుదాెటించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచేవారికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని విధాల అవకాశం ఉంటుందని అదేవిధంగా కేంద్రంతోనూ, సమీప రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కరా?టక, ఒడిశా లాంటి రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం కూడా ఇందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
పెట్టుబడులను ఆకర్షించాలంటే నిజాయతీతో కూడిన విధానాలు చాలా అవసరం. వీటిని అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు, ఈ విషయంలో ఇతరులకు ఆదర్శంగా (రోల్‌మోడల్) నిలుస్తాం. ఉత్తమ పారదర్శక విధానాల కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో కొన్ని చట్టాలు చేశాం. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో ఈ చట్టాలు తీసుకొచ్చాం. మా ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టామని జగన్ చెప్పారు.
కార్యక్రమంలో తొలుత కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఎకనమిక్ డిప్లమసీ అండర్ స్టేట్స్ డివిజన్ అదనపు కార్యదర్శి పి హరీష్ స్వాగతోపన్యాసం ఇస్తూ భారతదేశానికే ధాన్యాగారం (రైస్ బౌల్)గా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీపీలో మూడవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. పారిశ్రామికంగా కూడా మెరుగైన అభివ ద్ధి సాధించేందుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని ముఖ్యంగా బ్లూ ఎకానమిక్ అభివ ద్ధికి లాజిస్టిక్స్ రంగ అభివ ద్ధికి ఎంతో అనుకూలంగా ఈ ప్రాంతం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఈ డిప్లమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమం ప్రారంభోత్సవ సెషన్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల హై కమిషనర్లు, అంబాసిడర్లు, కౌన్సిల్ జనరళ్లు, రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













