అనంతపురం కలెక్టర్ ను అభినందించిన సీఎం
కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ జాతీయ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడును ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూర్చే దిశగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య, జేడీఏ రామకృష్ణ పాల్గొన్నారు.













