Veeraiah Chowdhury: వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు
టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి (Veeraiah Chowdhury) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చి దైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలు (Ongole) లో టీడీపీ నేత వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. సీఎం వెంట మంత్రులు అనిత (Anita) , ఆనం, డోలా, ఎంపీ మాగుంట (MP Magunta) , పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.













