Chandrababu: ఇది దేవుడు సృష్టించిన అద్భుతం .. మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుడతా

ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి జిల్లా లగిశపల్లిలో చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిస్తాయి. మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉంటారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం. గిరిజనులు అభివృద్ధి అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై మొదట దృష్టి సారించింది ఎన్టీఆర్ (NTR). గిరిజనుల సంక్షేమం గిరిజన ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలో ఐఏఎస్ (IAS) లను నియమించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఏడు ఐటీడీఏ (ITDA)లు సమర్థంగా పని చేయాలనే ఐఏఎస్‌లను ఉంచాం. అవకావాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సాధిస్తారు. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠశాలలకు భవనాల కోసం నిధులు విడుదల చేస్తున్నాం. గిరిజన ప్రాంతాలకు వైద్యసేవలు (Medical services) అందుబాటులోకి తీసుకొచ్చాం. డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా మారుస్తున్నాం. నేను సీఎంగా ఉన్నప్పుడు చైతన్యం కార్యక్రమం తీసుకొచ్చాను. గిరిజనుల్లో చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధి ఆగదు. హక్కులు కాపాడుతూ ముందుకెళ్తేనే మీ జీవితాల్లో వెలుగులు సాధ్యమవుతాయి అని అన్నారు.