Chandrababu: వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ : చంద్రబాబు
వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్ (Section Certificate) ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రూ.10 లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయం (Secretariat) లో రూ.100 చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. రూ.10 లక్షలు దాటిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల (Caste certificate)ను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబరు(October) 2లోగా పరిష్కరించాలని సూచించారు.













