సీఎం అమెరికా పర్యటన విజయవంతం
రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన విజయవంతమైందని, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అక్కడ చేసుకున్న ఒప్పందాలు సఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఇటీవల శంకుస్థాపన జరిగిన మెగ సీడ్‌పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ఆయోవా విశ్వవిద్యాలయం 80 దేశాలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తుందన్నారు. కర్నూలు జిల్లా తంగడంచలో 650 ఎకరాల విస్తీర్ణంలో 680 కోట్ల వ్యయంతో అయోవా సాంకేతిక పరిజ్ఞానంతో మెగా సీడ్‌పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రైతు రుణమాపీ, విత్తన పంపిణీ, అవుట్‌పుట్ సబ్సిడీ, రైతులకు ఆధునిక సాంకేతిక అంశాల్లో సహకరించేందుకు ప్రభుత్వం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో నవంబర్ 15 నుంచి మూడు రోజులపాటు జాతీయ స్థాయి వ్వవసాయ సదస్సు జరుగనుందనీ, ఈ సదస్సుకు బిల్‌గేట్స్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.













