ఐటీకి ప్రాధాన్యమిచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా
నేను గతంలో ఐటీ రంగానికి ప్రాధాన్యమిచ్చి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న ఏపీ అగ్రోటెక్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వాడకం, జలవనరుల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీతో భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయానికి సాంకేతికత జోడించడం అత్యంత కీలకమైన అంశం అని, వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 11.67 శాతంగా ఉందని, త్వరలోనే 15 శాతానికి చేరుకుంటుదన్నారు. సూక్ష్మపోషకాల వాడకంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. అలాగే పంటలు కాపాడటానికి రెయిన్గన్లను వాడుతున్నామన్నారు. ఆక్వా రంగంలో ప్రథమస్థానంలో ఉన్నా. ప్రపంచంలో కొత్తగా వచ్చే ఏ సాంకేతికతైనా రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.













