తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదు : చంద్రబాబు
తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడ సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనను ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్చంద్ర కర్ణాటక సీఎస్తో మాట్లాడారు. రేపు, ఎల్లుండి జరిగే పరీక్షల్లో తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న తెదేపా సమన్వయ కమిటి సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.













