దేశంలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వ్యవస్థలను పతనం చేశారు. ఎస్సీలు,ఎస్టీలు,ముస్లింలలో అభద్రత. బలహీనవర్గాలకు రక్షణ లేదు. చివరికి మీడియాపై కూడా వేధింపులు. దేశంలో భయానక వాతావరణం తెచ్చారు. సిబిఐ దాడులతో ప్రత్యర్దులపై కక్ష సాధింపు. ప్రతివ్యక్తి ఆలోచించాల్సిన సమయం ఇది. మేధావులు అందరూ చర్చించాల్సిన అంశాలివి.
ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లింలపై బిజెపి వేధింపులు. ముస్లిం కుటుంబ వ్యవస్థను విచ్చిన్నం చేయాలని కుట్రలు. ముస్లింలకు అండగా తెలుగుదేశం ఉంటుంది.
కోడికత్తి కేసులో ఏమైనా ఉందా..? ఫిర్యాదు కూడా చేయకుండా బాధ్యత లేకుండా వెళ్లిపోయాడు. ఈ దేశంలో పోలీసులపై నమ్మకం లేదట. లేకపోతే ఏ దేశానికైనా వెళ్లి విచారణ చేయించుకుంటారా..?
రాష్ట్ర అధికారాల్లో కేంద్రం జోక్యాన్ని సహించేది లేదు. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. అదీ ప్రభుత్వమే,ఇదీ ప్రభుత్వమే. ఒకరి అధికారాల్లో మరొకరి జోక్యం తగదు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం: ముఖ్యమంత్రి చంద్రబాబు.
గత చరిత్రను ఒకసారి అందరూ తిరగేయాలి. ఈ నాలుగున్నరేళ్లలో ఏమి చేశామో చూడండి. పేదలకు చేసిన సంక్షేమాన్ని గుర్తించాలి. రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని గుర్తించండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి.
ఈ 100రోజులు ఇంటికో మనిషి రావాలి. రాష్ట్రాభివృద్ధికి బాసటగా నిలబడాలి. పేదల సంక్షేమంపై ప్రచారం చేయాలి. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలి. టిడిపి గెలుపు కోసం కష్టపడాలి. ఇది ప్రతి కుటుంబ బాధ్యతగా గుర్తించాలి. నా కష్టం పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమే.













