Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అద్భుతం : చంద్రబాబు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆ శ్రీవారిని దర్శించుకుని పుణీతులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల (Srivari Brahmotsavam) నిర్వహణ అద్భుతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కొనియాడారు. ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను టీటీడీ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చంద్రబాబు అన్నారు.