చరిత్ర అంటే వ్యక్తుల జీవితమే…
ఆవేశంలో అగ్నిపర్వతం…ప్రేమించడంలో హిమశిఖరం ఈ ఉపోద్ఘాతం ఒక్క విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికే అంకితం తెలుగు జాతి పౌరుషం, హుందాతనం, గౌరవానికి నిలువెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు భార్యభర్తల ప్రేమానుబంధాలు కలసి బతికినంతకాలమేకాదు ఒకరు స్వర్గస్తులైనా మరోకరి గుండెలో పదిలమై మరచిపోలేని జ్జ్ఞాపకాల దొంతర్లలో ఆవేదనను జీవితాంతం అనుభవిస్తున్న తీరుకు కింది ఫొటోలో… బసవ తారకం గారిని దేవతగా కొలుస్తూ ఎన్టీఆర్ నిరంతరం తలుస్తూ మనోవేధనకు గురయ్యారనడానికి ప్రత్యక్ష తార్కాణం…. భార్య బసవ తారకం అంటే ఎన్టీఆర్ జీవితంలో సగభాగం..ఆమెపై ఆయనకు వల్లమాలిన అభిమానం కాదు ప్రేమ కాదు ప్రాణం…ఆమే ఆయనకు మార్గదర్శి…వెన్నంటి నడిపిన భాగస్వామి…కష్టకాలంలోనూ భుజంతట్టి కర్తవ్యదీక్ష వైపు నడిపిన మహోన్నత వ్యక్తిత్వం… తెలుగుజాతి, తెలుగుదేశం పార్టీ, భార్యాభర్తల అనురాగం, ప్రేమానుబంధాలు, సమాజశ్రేయస్సుకు అంకితమిచ్చిన పుణ్యదంపతుల చరిత్రకు సజీవచిత్ర రూపం… అందుకే.. ‘మహానాయకుడు’ను యువత, ఫస్ట్‌టైమ్ ఓటర్లు చూడాలి: చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మహానాయకుడు సినిమాను యువత, ఫస్ట్ టైమ్ ఓటర్లు చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్రమోదీది పేదలకు సేవలో చివరిస్థానం అని, నటనలో మాత్రం అగ్రస్థానం అన్నారు.













