మరో కీలక ఘట్టం విజయవంతం
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్‌కు చెందిన తొలి కక్ష్యను విజయవంతంగా తగ్గించినట్లు ఇస్రో ప్రకటించిది. ల్యాండర్‌ను అత్యంత సున్నితంగా చంద్రుడిపై కక్ష్యలోకి దింపే ముందు ఈ కక్ష్యను తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. ఈ నెల 7వ తేదీన 1:10 (ఉదయం) నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-2 దిగనుంది. రేపు మరోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియ చేపడతామని వెల్లడించింది. కొద్ది రోజులు భూకక్ష్యలో తిరిగి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలో చేరింది చంద్రాయన్-2. ఆ తర్వాత కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆరు సార్లు సమర్థవంతంగా చేపట్టింది ఇస్రో.













