Chandrababu : ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం : చంద్రబాబు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman), కుమారస్వామి (Kumaraswamy) కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదు. విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులే. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు అన్నారు.













