మెట్రోకు ప్రత్యామ్నాయం ‘హైపర్‌లూప్’
అమరావతిలో మైట్రోరైల్కు ప్రత్యామ్నయంగా ‘హైపర్‌లూప్’ ప్రజా రవాణా వ్యస్థ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై అధ్యయం చేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సిఆర్డిఎ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంప్ కార్యాలంలో నిర్వహించిన సమీక్షాసమావేశంలో సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. మెట్రోరైల్‌కు మించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిఉన్న, అత్యంత వేగంగా ఉండే రవాణా వ్యవస్థను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేలా అధ్యయనం జరపాలన్నారు. ఇందుకోసం తగిన వ్యవస్థను నెలకొల్పడానికి హైపర్‌లూప్ వన్ సంస్థ ఆసక్తిని కనబరచిందని సిఎం అధికారులకు సూచించారు. హైపర్‌లూప్ వ్యవస్థ విశేషాలను ఆ సంస్థ ప్రతినిధులు సిఎం చంద్రబాబుకు వివరించారు. హైపర్‌లూప్ టెక్నాలజీ ఏర్పాటు సాకారమైతే విశాఖనుండి అమరావతికి కేవలం 23 నిమిషాల్లో, అమరావతి నుండి తిరుపతికి కేవలం 25 నిమిషాల్లో చేరుకోచ్చునని వారు తెలిపారు. అలాగే అమరావతి నుండి హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నైతదితర ఇతర రాష్ట్రాలకు కూడా విమానం కన్నా వేగంగా చేరుకోవచ్చునని ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై పూర్తి అధ్యయనం జరిపి, సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా సిఎం ఆదేశించారు. హైపర్‌లూప్ రవాణ వ్యవస్థ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు, హైపర్‌లూప్ పరిశోధనా కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ంసిఆర్డిఎ పరిధిలో స్టార్‌హోటళ్ల నిర్మాణానికి వీలుగా 500 ఎకరాల విస్తీర్ణాన్ని వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. అమరావతిలో పర్యాటకులు, సందర ్శకులు ఉండేందుకు వీలుగా హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడంతో పాటు ఎంటర్టైన్మెంట్ కేంద్రాలు, కన్వెన్షన్ సెంటర్లు తగినన్ని నిర్మించాలని సిఎం సిఆర్డిఎ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.













