సైకో పాలన వద్దు… సైకిల్ పాలన ముద్దు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పాలన వద్దు, సైకిల్ పాలన ముద్దని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేది. రైతులు పండిరచే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకున్నాం. డ్వాక్రా సంఘాలను పంపించి కల్లాల వద్దే కొనుగోలు చేశామన్నారు. అహంభావంతో నిండిపోయిన వ్యక్తి జగన్ అని, రైతుల మీద వాలంటీర్ల పెత్తనం ఏంటో అర్థం కాదని విమర్శించారు. పంపుసెట్లకు మోటర్లు పెడుతున్నరని మండిపడ్డారు. జగన్ అన్ని వ్యవస్థలను మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకుని ప్రశ్నించారు. వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా? ఆర్బీఐలను ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. రైతుల పంటను మొబైల్ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చాం. దేశంలోనే వ్యవసానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టింది టీడీపీనే అని అన్నారు.













