అధికారంలోకి రాగానే తొలి సంతకం దానిపైనే : చంద్రబాబు
ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పింఛన్ తీసుకొచ్చిందే టీడీపీ. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేశాం. దీన్ని రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ అందజేస్తాం. మన భూమి పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు? దానిపై రాజముద్ర ఉండాలి. సైకో పోటో కాదు. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తిని జగన్ పెడుతున్నారు. మనకు ఏ సమస్య ఉన్నా ఆ అధికారి వద్దకే వెళ్లాలి. మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నారు. మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా శవ రాజకీయాలు చేస్తోంది అని విమర్శించారు.













