లోకేష్ కోసం చంద్ర బాబు.. పవన్ ను పక్క దారి పట్టిస్తున్నారా…
టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తు కుదిరిన తర్వాత వీటిపై చర్చ మరింత జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా పవన్ తన కోటాలోకి వచ్చిన అతి తక్కువ సీట్ల నుంచి బీజేపీ కి భాగం పంచడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరో పక్క ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి అన్న కామెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎంపీగా పోటీ చేసి.. కేంద్రం లో బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడ కేంద్ర మంత్రి గా సెటిల్ అవుతాడు అని చాలామంది భావిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అన్న బాటలోనే తమ్ముడు నడుస్తాడు అన్న మాట బలంగా వినిపిస్తోంది. మరోపక్క దీనికి చంద్రబాబు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు టాక్. పవన్ ఇక్కడే కంటిన్యూ అయితే అది లోకేష్ కి ఎప్పటికైనా ముప్పు కావచ్చు అని భావిస్తున్న చంద్రబాబు.. పవన్ ను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు దూరం చేసి కేంద్రానికి పంపేయాలని చూస్తున్నారు అని కాపు సమాజికవర్గంలో ఒక బలమైన చర్చ నడుస్తుందని తెలుస్తుంది. అదే గనక జరిగితే రాష్ట్రంలో తమ సమాధిక వర్గం మళ్లీ తిరిగి బలహీన పడిపోతుంది అని కాపులు సతమతమవుతున్నారు.ఈ నేపథ్యంలో లో హరిరామ జోగయ్య.. పవన్ లోక్ సభ లో పోటీ చేయాలి అంటూ ఓ లేఖను రాశారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి అనుకుంటే అది ఇక్కడే ఉండే సాధించాలి కానీ కేంద్రంలో అయితే కుదరదని ఆయన ఈ లేఖలో స్పష్టం చేశారు. పవన్ కేంద్రానికి వెళ్ళిపోతే ఇక్కడ కాపు ప్రాతినిధ్యం బలంగా ఉండదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం పవన్ వైఖరిపై అతని సామాజిక వర్గంలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఇది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.













