టీడీపీ అధికారంలోకి వస్తే.. మొదటి సంతకం దానిపైనే : చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్కు బీసీలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు దగ్గరల్లోనే ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కావలిలో నిర్వహించిన ఇదే ఖర్మ బీసీలకు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమానికి సంబంధించిన అంశంపైనే తొలి సంతకం పెడతానని ప్రకటించారు. బీసీల కులవృత్తులను సీఎం ఎగతాళి చేస్తున్నారని ఆరోపించారు. రజకులకు ఆధునిక పరికరాలు ఇచ్చి కులవృత్తుల గౌరవం కాపాడిన పార్టీ టీడీపీ అని తెలిపారు. రజకులు దుస్తుల తరహాలోనే జగన్ను ఉతికి ఉతికి ఆరేయాలని వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేసి తనతో చర్చకు జగన్ సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. చేపలు ఇచ్చి చేతులు దుపుకోవడం కాదు. వలలిచ్చి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం బతుకుతారనేది టీడీపీ సిద్ధాంతమని తెలిపారు.













